SKLM: రూరల్ మండలంలోని బైరి జంక్షన్లో వైఎస్ఆర్ విగ్రహం లారీ వెనుక భాగం ఢీకొనడంతో విధ్వంసానికి గురైందని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నిందితునిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.