KMM: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి చందన్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 385 రైతులకు రూ.1.45 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు. 29,056 క్వింటాళ్ల సన్నధాన్యానికి బోనస్ చెల్లించామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకాలు జరిపి మద్దతు ధర, బోనస్ పొందాలని ఆయన కోరారు.