ASR: చింతూరు మండలం కల్లేరు వద్ద సీలేరు నదిలో ఆదివారం గల్లంతయిన యువకుల మృతదేహాలు మంగళవారం లభ్యమైనట్లు చింతూరు ఎస్సై రమేష్ తెలిపారు. మృతులు చింతూరుకి చెందిన ఎస్.శ్రీను, ఎన్.దిలీప్ కుమార్‌గా గుర్తించినట్లు ఆయన చెప్పారు. స్నానం చేయడానికి దిగి ఒకరు గల్లంతు కాగా మరొకరు అతనిని రక్షించబోయి నది ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు తెలిపారు.