ఛత్తీస్‌గఢ్‌లోని నంబి అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నిన్నటి నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం నంబి అడవుల్లోకి భారీ సంఖ్యలో భద్రతా బలగాలు వెళ్లారు. కాగా నిన్న ఒక మావోయిస్టు మృతదేహంతో పాటు 315 బోర్ రైఫిల్, టిఫెన్ బాంబు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.