GNTR: పొన్నూరు పురపాలక సంఘం కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా పారిశుద్ధ్యానికి సంబంధించిన పనులను పర్యవేక్షించారు. అనంతరం పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసి ఆహార పదార్థాలు నాణ్యత గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.