మేడ్చల్: టీజీఎస్పీడీసీఎల్ జీడిమెట్ల డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ ఎస్.సురేందర్ రెడ్డి రూ. 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. 11 KV లైన్ షిఫ్ట్ చేయడం, కొత్త భవనానికి కేబుల్ వేయడం కోసం పని అంచనా నివేదిక అందించేందుకు ఈ లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. పక్కా ప్లాన్ వేసిన అధికారులు డబ్బులు తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు.