RR: మైలార్ దేవుపల్లి డివిజన్ పరిధిలోని బాబు రెడ్డి నగర్ మార్కండేయ నగర్ హైవే రోడ్‌పై డివైడర్ పనులు జరుగుతున్నాయి. దీనివల్ల స్థానికులు రోడ్డు దాటడానికి ఇబ్బందిగా ఉందని చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందని కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డికి తెలియజేశారు. దీంతో పనులను కార్పొరేటర్ పరిశీలించారు. GHMC అధికారులు, ట్రాఫిక్ సీఐతో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.