HYD: దిల్సుఖ్నగర్లోని హాస్టళ్లలో నీటి కొరత మొదలైంది. హాస్టల్స్ విద్యార్థులు, ఉద్యోగస్థులు అవసరాలకు నీళ్లులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ హాస్టల్ యాజమాన్యం బోర్ వేయించి దానికి అయిన ఖర్చుగా హాస్టల్లో ఉండేవారి నుంచి అదనంగా రూ.500 వసూలు చేసి భారం వేస్తున్నారని విద్యార్థులు వాపోయారు. అధికారులు నీటి ఎద్దడిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.