SRCL: యాసంగి సీజన్లో పండించిన వరి ధాన్యాన్ని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ ఆదేశించారు. యాసంగి 2024-25 వరి ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో బుధవారం నిర్వహించారు. ఈ సమావే శానికి అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు.