NZB: గాంధారి మాదిగ ఉప కులాల వారీగా రిజర్వేషన్లను ప్రకటించడం హర్షనీయమని మాజీ టీఎన్జీవోస్ కార్యదర్శి సాయిలు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మాదిగ వారికి వర్గీకరణతో ఉప కులాలకు సంపూర్ణ న్యాయం జరిగిందని తెలిపారు. మాదిగ ఉప కులాలకు కావాలసిన రిజర్వేషన్లు వచ్చాయని స్పష్టం చేశారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేసిన పోరాటానికి ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు.
MDK: వివాహ శుభకార్యాలు, పుణ్య క్షేత్రాలు, తీర్థయాత్రలకు, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని మెదక్ డీఎం సురేఖ కోరారు. 200 కిలోమీటర్లకు పల్లెవెలుగు బస్సుకు రూ.13, 200, ఎక్స్ ప్రెస్ బస్సుకు రూ.14, 700 ఉంటుందన్నారు. ఈ రేట్లు 12 గంటల సమయం పాటు వర్తిస్తాయని, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని ఆమె కోరారు.
PDPL: నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ అన్నారు. ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కనగర్తి గ్రామంలో ప్రజల సహకారంతో 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఏసీపీ గజ్జి కృష్ణ సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై దీకొండ రమేష్, గ్రామ ప్రజలతో కలిసి ప్రారంభించారు.
SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీహరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు గ్రామంలో చికెన్, మటన్ విక్రయాలు చేయవద్దని బజరంగ్ దళ్ మండల నాయకులు విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని దాభాలు, వైన్ షాప్‌ల నిర్వాహకులు మూడు రోజుల వరకు విక్రయాలు చేయకుండా తమకు సహకరించాలని కోరారు.
JGL: జిల్లాలోని దివ్యాంగులకు ఉపాధి, పునారావాస పథకంలో భాగంగా జీవనోపాధి పొందుటకు సబ్సిడీ ఋణాలు అందజేస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద బ్యాంకు లింకేజి లేకుండా దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం రూ.50,000 ల వరకు సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. కావున అర్హులైన దివ్యాంగులు ఈ నెల 8వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
NZB: ఆర్మూర్ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు బాలు మాట్లాడుతూ.. పీఎం మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందరికీ ఆమోదయోగమైన బడ్జెట్‌కు అందజేశారన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ కంచెట్టి గంగాధర్ ఉన్నారు.
HYD: మహానగరంలో మరిన్ని రవాణా ఆధారిత అభివృద్ధి(TOD) కారిడార్లకు HMDA ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ కారిడార్లలో ప్రత్యేక వ్యాపార, వాణిజ్య జోన్ల కోసం లోకల్ ఏరియా ప్లాన్లకు రూపకల్పన చేసేలా తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా కారిడార్లలో రోడ్లకు ఇరువైపులా 500 మీటర్ల వరకు ప్రత్యేక నిబంధనలను వర్తింపజేయనున్నారు.
HYD: ఫేక్ కాల్ సెంటర్లతో జాగ్రత్తగా ఉండాలని యాచారం సీఐ నరసింహారావు సూచించారు. ఆన్‌లైన్‌లో వేలాది ఫేక్ కాల్ సెంటర్లు ఉన్నట్లు తెలిపారు. ప్రముఖ కంపెనీల పేరిట నకిలీ వెబ్సైట్లు, ఆన్లైన్లో సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనీ,ఫేక్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే మోసపోతారని క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దన్నారు.
SRCL: ముస్తాబాద్ మండలంలో ఓ బాలుడు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల ప్రకారం.. మొర్రపూర్ గ్రామానికి చెందిన భూక్య చరణ్ (16) అనే బాలుడు తన స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని ఓ చెరువులో ఈత కొట్టాడు. చరణ్‌కు ఈత సరిగా రాకపోవడంతో నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. బాలుడి వెంట ఉన్న ఇద్దరు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
HYD: GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. కార్పొరేటర్లు 15 మందిని స్టాండింగ్ మెంబెర్స్‌ను ఎన్నుకోనున్నారు. ఈ నెల 10 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. 18న స్క్రూటినీ ఉండగా, నామినేషన్ల విత్ డ్రా 21న, 25న జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో పోలింగ్, అదేరోజు సాయంత్రం అధికారులు ఫలితాలు ప్రకటించనున్నారు.
KNR: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో కరీంనగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని సీపీఎం నాయకులు చెవిలో పువ్వు.. చేతిలో చిప్ప పట్టుకుని తెలంగాణ చౌక్లో వినూత్నంగా నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించింది.. కానీ టీజీకి ఎందుకు నిధులు కేటాయించలేదని మండిపడ్డారు.
HYD: గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అరెస్టు చేసిన ఘటన పటాన్‌చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. గంజాయి అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక తిమ్మక్క చెరువుపై ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 250 గ్రాముల ఎండు గంజాయి, రెండు సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు.
SRPT: ఈనెల 7న హైదరాబాద్‌లో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చేపట్టే లక్ష డప్పులు, వేల గొంతుల సభకు తాము పూర్తిగా మద్దతునిస్తున్నామని సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొత్తగట్టు మల్లయ్య తెలిపారు. మంగళవారం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ చేయాలన్నారు.
NRML: కుబీర్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంకు వినియోగదారులకు మంగళవారం స్థానిక ఎస్సై రవీందర్ సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరిచయం లేని వ్యక్తులకు ఓటీపీ, ఫోన్ పాస్వర్డ్‌లు చెప్పొద్దని సూచించారు. ఆర్థిక నిరాలకు గురైతే వెంటనే బ్యాంకు, పోలీసులకు సంప్రదించాలని అన్నారు.