MNCL: జన్నారం మండలంలోని కలమడుగు జడ్పీ పాఠశాల విద్యార్థులకు ఆర్బీఎస్కే వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలను పంపిణీ చేశారు. బుధవారం ఆర్బీఎస్కే జిల్లా సహాయ అధికారి గౌరీ శంకర్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కంటి చూపు సమస్య ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా కళ్లద్దాలను వాడాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం రాజమౌళి ఉన్నారు.