SRD: ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో వైద్యశాఖపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి మాత శిశు మరణాల రేటు 50% తగ్గినట్లు చెప్పారు. ఆసుపత్రులకు వచ్చే రిస్కు కేసులు ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందేలా చూడాలని సూచించారు.