ADB: ఉట్నూర్ పట్టణంలోని ఐటీడీఏ ఉద్యానవన నర్సరీలో పెంచుతున్న పుచ్చకాయ తోటను ప్రాజెక్ట్ అధికారి కుష్బూ గుప్త పరిశీలించారు. బుధవారం సాయంత్రం ఆమె ఉద్యానవన నర్సరీని సందర్శించి అక్కడ పెంచుతున్న పుచ్చకాయ తోటను పరిశీలించి హార్టికల్చర్ ఆఫీసర్ సందీప్ కుమార్ను వివరాలు అడిగి తెలుసుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐటీడీఏ అధికారులు, సిబ్బంది ఉన్నారు.