NZB: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించే మహిళా సంఘాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా మద్దతు అందిస్తామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు భరోసా కల్పించారు. మంగళవారం నిజామాబాద్ నగరంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 110 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు.