ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి భారీ ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం రైతాంగానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారడంతో కల్లల్లో ఆరేసిన మిర్చి, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. అసలే పంటకు ధర లేదని ఇబ్బంది పడుతున్న సమయంలో మళ్ళీ అకాల వర్షం రైతులను నష్టాల్లోకి నెట్టింది.