JGL: నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పి భీమ్ రావు, డీఎస్పీలు రఘు చంధర్, రాములు, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీఖాన్, రఫీక్ ఖాన్, శ్రీనివాస్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు, పాల్గొన్నారు.