NGKL: శ్రీశైలం ఎడమగట్టు SLBC సొరంగంలో గల్లంతైన ఆరుగురి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సహాయక బృందాలు గాలింపు నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి శుక్రవారం తెలిపారు. సాంకేతిక నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకోనున్నారు.