HYD: సమ్మర్లో నగరంలోని స్విమ్మింగ్ పూల్స్‌కు డిమాండ్ పెరిగింది. వేసవి సెలవుల్లో ఈతకోసం నగరవాసులు క్యూ కడుతున్నారు. ఇది స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులకు వరంగా మారింది. డిమాండ్‌కు తగ్గట్లుగానే ఒక్కో కస్టమర్‌కు గంటకు రూ.100 నుంచి రూ.200గా ధరలు నిర్ణయించారు. సమ్మర్ ప్యాకేజీ పేరిట నెలకు రూ.2 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు.