WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కాజీపేట ఏసీపీ బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) తిరుమల్ హైడ్రా డీఎస్పీగా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఆయనను నియమిస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.