ADB: గుడిహత్నూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఈద్గా, ఖబ్రస్థాన్ అభివృద్దికి రూ.5 లక్షలు కేటాయించినందుకు గాను ముస్లింలు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని గజేందర్ పేర్కొన్నారు.
MNCL: జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో ఉన్న శ్రీ నర నారాయణస్వామి వారి దేవాలయంలో యజ్ఞ హోమాలు నిర్వహిస్తున్నారు. ఆ దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మధ్యాహ్నం దేవాలయం ఆవరణలో వేద పండితులు వివిధ యజ్ఞ హోమాలు చేస్తున్నారు. అంతకు ముందు దేవాలయంలోని శ్రీ నారా నారాయణ స్వామి వారి మూల విగ్రహాన్ని వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.
SRD: కంగ్టి మండల ఎంపీపీ సమావేశం మందిరంలో గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సత్తయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున మండల పరిధిలోని పార్టీల నాయకులు విధిగా హాజరుకావాలని కోరారు. స్థానిక ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
MNCL: ముల్కల్ల అటవీ బీట్ పరిధి నుంచి చుక్కల దుప్పి గుడి పేట గ్రామ శివారులోని ఎస్సీకాలనీలోకి రాగా కాలనీలోని వీధి కుక్కలు ఒక్కసారిగా మంగళవారం రాత్రి దాడి చేశాయి. గమనించిన స్థానికులు వాటిబారీ నుంచి కాపాడి అటవీ అధికారులకు సమాచారం అందించారు. పాత మంచిర్యాల అటవీ బీట్ సెక్షన్ అధికారి అతావుల్లా గ్రామానికి చేరుకొని దుప్పిని ఎల్లంపల్లి ప్రాజెక్టు వైపు వెళ్లేలా చేశారు.
సిద్దిపేట: రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో బీసీల రిజర్వేషన్, మున్నూరు కాపుల జనాభాను తగ్గించి చూపెట్టారని కాపు కులస్తులు డిమాండ్ చేశారు.బీసీల రిజర్వేషన్ రీసర్వే చేయాలని రాష్ట్ర మున్నూరు కాపు పిలుపుమేరకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కార్యక్రమంలో భాగంగా ముందస్తుగా హుస్నాబాద్ పోలీసులు హుస్నాబాద్ మున్నూరు కాపు కులస్తులను అరెస్టు చేశారు.
ADB: ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్వహించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందంబా కళ్యాణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులు సమిష్టిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించుకోవడం గొప్ప విషయమని అనిల్ జాదవ్ పేర్కొన్నారు.
SRD: పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ… రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పనిచెయ్యాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు అసెంబ్లీ ప్రభారి శ్రీనివాస్ ఉన్నారు.
SRD: నారాయణఖేడ్ మండలం సంజీవనరావుపేట గ్రామానికి చెందిన మైపాల్ ఆసుపత్రి వైద్య ఖర్చుల కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 28,500 చెక్కును నారాయణఖేడ్ మాజీ MLA భూపాల్ రెడ్డి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అందజేశారు. ప్రస్తుతం అధికారంలో లేకపోయినప్పటికీ ప్రజాసేవ కోసం నిరంతరం కృషి చేస్తానని భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో మాజీ ఎంపీటీసీ భూపాల్ ఉన్నారు.
MDK: రామయంపేట మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన రాజలింగానికి సీఎం సహాయ నిధి చెక్కును మాజీ సర్పంచ్ కాముని రవీంద్ర బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితునికి మెరుగైన వైద్య నిమిత్తం రూ. 36 వేల సీఎంఆర్ఎఫ్ చెప్పిన అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ కు కృతజ్ఞతలు తెలిపారు.
JGL: వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్ మండలం పోతారం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆయనను ఘనంగా సన్మానించారు.
BDK: కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం చేపల మార్కెట్ ఏరియాలో ఇటీవల కిన్నెరసాని పైప్ లైన్ వేశారు. ఈ పైప్ లైన్ కోసం తవ్విన గుంటలను మట్టితో పూడ్చారు. అయితే ప్రస్తుతం ఆ పైప్ లైన్ లీకేజీ వల్ల నీరు రోడ్డుపైకి చేరి అసౌకర్యంగా మారుతోందని బుధవారం స్థానికులు చెప్పారు. గుంటలను పూడ్చిన మట్టి లీకైన నీటితో బురదమయంగా మారుతోందని తెలిపారు.
NGKL: కల్వకుర్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు ఠాకూర్ బాలాజీ సింగ్ కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందివ్వాలని బాలాజీ సింగ్ సీఎంని కోరారు. అనంతరం బాలాజీ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బాలాజీ వెంట నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
MDK: ఢిల్లీలో జరిగిన పరిపాలనా సంస్కరణల అంతర్జాతీయ సదస్సుకు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్‌గా మూడు జిల్లాల్లో పనిచేసిన పాలనాపరమైన అనుభవాలను దేశ,విదేశీ ప్రతినిధులతో పంచుకున్నారు. ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్, భారత ప్రభుత్వ అధీనంలోని పరిపాలనా సంస్కరణల విభాగం సంయుక్తంగా సదస్సు నిర్వహించారు.
MHBD: రైతుల కండ్లలో ఆనందం చూడడమే, రైతును రాజు చెయ్యడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో ఇటీవల సాగునీటి కొరత సమస్య ఉందని ఎమ్మెల్యే తెలుసుకున్నారు. వెంటనే స్పందించి, బయన్న వాగు రిజర్వాయర్‌ను రైతులతో కలిసి సందర్శించారు. అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
KMM: మిర్చి బస్తాలను దుండగులు చోరీ చేసిన ఘటన తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఆటోలో లోడ్ చేసిన మిర్చి బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. పంట పెట్టుబడి కోసం రూ. లక్షలు అప్పుగా తీసుకొచ్చి, ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి పంటను దుండగులు చోరీ చేశారని బాధిత రైతు వాపోయాడు.