KMR: కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు గురువారం తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారని.. ముఖ్య నాయకులు సమావేశానికి హాజరు కావాలని సూచించారు.