నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర ఒక ప్రకటనలో, వివిధ పన్నులను మున్సిపల్ అధికారులకు మాత్రమే చెల్లించాలని ప్రజలకు సూచించారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి, క్యూఆర్ కోడ్ పంపి ఇంటి, వాణిజ్య పన్నులు కట్టమని అడుగుతున్నట్లు ఆయన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.