SRD: రామచంద్రపురం 268వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ గ్రామ పురోహితుడు బాలకృష్ణ పంతులు, గ్రామ పెద్దలు, అన్ని కులాల నాయకులతో కలిసి పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.