ASF: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసంలో గురువారం ఉగాది పండగను ఘనంగా జరుపుకున్నారు. శ్రీ పరాభవ నామ ఉగాది సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా తయారుచేసిన ఉగాది పచ్చడిని ప్రజా ప్రతినిధులకు, నాయకులకు పంపిణీ చేసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ ఛైర్మన్ ఎండీ అహ్మద్ పాల్గొన్నారు.