KRM: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మాచారెడ్డి(మం) గజ్యా నాయక్ తండా చౌరస్తాలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుధనపోయిన లక్ష్మి, కర్రెప్ప, నరసవ్వల కొత్త ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు ఉన్నారు.