WNP: కానాయిపల్లి కోటిలింగేశ్వర దేవస్థానం గురువారం తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. భక్తులు తెల్లవారుజామునే లేచి కొత్త వస్త్రాలు ధరించి దేవాలయానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో కోటిలింగేశ్వరుడిని, స్వర్ణ కవచ పంచలోహ శివలింగాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ఆలయకమిటీ భక్తులకు షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని వితరణ చేశారు.