MHBD: గూడూరు మండలం గాజులగట్టులో పండుగ పూట విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రైతు ధారవత్ నార్య (52) గురువారం వ్యవసాయ భూమిలో మోటార్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాస్తు కాలు జారి బావిలో పడి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసి మార్చురీకి తరలించారు. నార్య మృతితో గాజులగట్టులో విషాద ఛాయలు అలుముకున్నాయి.