JGL: పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న ప్రధాన ఆలయాల్లో ఉగాది పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఉగాది పంచాంగ శ్రవణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పచ్చడి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జరగబోయే వాటిపై ఆలయ పూజారులు పంచాంగాన్ని తెలియజేశారు. గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ ఛైర్మన్ పాల్గొన్నారు.