BHPL: ప్రతి ఒక్కరు మత భేదాలు లేకుండా పరస్పరం గౌరవించుకుంటూ సామరస్యంతో జీవించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలోని ఈద్గా వద్ద నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కుల, మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి లాభపడే శక్తులను ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండాలన్నారు.