పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలోని నూతన జిల్లాల్లో కొత్తగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల(Collectorates)ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ (Telangana) రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో’ భాగంగా, నిర్మాణం పూర్తి చేసుకున్న మరో నాలుగు జిల్లాల కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది దినోత్సవాలను అత్యంత వైభవోపేతంగా, ఘనంగా జరుపుకోవాలని సీఎం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలు తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘన కీర్తి దశదిశలా చాటేలా, ప్రతి హృదయం ఉప్పొంగిపోయేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని సీఎం సూచించారు. జూన్ 4వ తేదీ ఆదివారం నాడు నిర్మల్ జిల్లా (Nirmal dist) కలెక్టరేట్ ను, జూన్ 6 మంగళవారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని, జూన్ 9 శుక్రవారం నాడు మంచిర్యాల జిల్లా, జూన్ 12 సోమవారం నాడు గద్వాల జిల్లా(Gadwal District) సమీకృత జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.