E.G: గోపాలపురం తహసీల్దార్ కార్యాలయంలో జనగణన-2027కు సంబంధించిన ఇళ్ల గణన జాబితాపై శనివారం పంచాయతీ కార్యదర్శులకు, గ్రామ రెవెన్యూ అధికారులకు శిక్షణ ఇచ్చినట్టు ఏఎస్వో జోడాల వెంకట్ తెలిపారు. కార్యక్రమానికి జిల్లా సెన్సస్ కార్యాలయం నుంచి ఇద్దరు అధికారులు వచ్చారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్లను వాయువ్య దిశ నుంచి తయారు చేయాలని సూచించారు.