TPT: రంజాన్ పండుగ సందర్భంగా తిరుపతి ఈద్గా మైదానంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముస్లీం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నేతలు, మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.