»Naveen Murder Because Of His Harassed To Niharika Hari Hara Krishna
naveen ఇంటర్లో పరిచయం, ఇంజినీరింగ్ కాలేజీ మారినా ఫ్రెండ్ షిప్.. నిహారిక కోసం
naveen and harihara:బీటెక్ స్టూడెంట్ నవీన్ (naveen) హత్య తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపింది. విచారణలో నిందితుడు హరిహర కృష్ణ (hari hara krishna) కూడా సంచలన విషయాలు తెలియజేశాడని పోలీసులు చెబుతున్నారు. దిల్షుఖ్ నగర్ ఐడీయల్ (idl) జూనియర్ కాలేజీలో హరిహర కృష్ణ ఇంటర్ చదవగా.. సెకండ్ ఇయర్లో నవీన్ (naveen) పరిచయం అయ్యాడని తెలిపాడు.
naveen murder because of his harassed to niharika: hari hara krishna
naveen and harihara:బీటెక్ స్టూడెంట్ నవీన్ (naveen) హత్య తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపింది. విచారణలో నిందితుడు హరిహర కృష్ణ (hari hara krishna) కూడా సంచలన విషయాలు తెలియజేశాడని పోలీసులు చెబుతున్నారు. దిల్షుఖ్ నగర్ ఐడీయల్ (idl) జూనియర్ కాలేజీలో హరిహర కృష్ణ ఇంటర్ చదవగా.. సెకండ్ ఇయర్లో నవీన్ (naveen) పరిచయం అయ్యాడని తెలిపాడు. నవీన్ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో.. హరి అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చేస్తున్నారు. ఇంజినీరింగ్ కాలేజీలు మారినా.. ఇద్దరూ కలిసేవారట. నవీన్‌కు నిహారిక (niharika) పరిచయం.. ప్రేమగా (love) మారిందని తెలిపారు. తర్వాత నవీన్ మరో అమ్మాయితో తిరుగుతున్నాడని.. నిహారిక గొడవపడి.. మాట్లాడటం మానేసిందని చెప్పాడు.
నిహారిక (niharika) అంటే తనకు ఇష్టం అని.. ఆమెతో చనువుగా ఉండేవాడినని తెలిపారు. 9 నెలల క్రితం ప్రేమిస్తున్నానని (love) నిహారకకు చెప్పగా.. ఆమె అంగీకరించిందని తెలిపాడు. నవీన్ (naveen) నిహారిక కాల్ చేసి, మెసేజ్ చేసి ఇబ్బంది పెట్టేవాడని.. నవీన్ ఫోన్ చేస్తే నిహారిక మాట్లాడేది కాదని హరి చెప్పాడు. నవీన్‌ను అంతం చేయాలని 3 నెలల క్రితమే డిసైడయ్యాడట. 2 నెలల క్రితం మలక్ పేట డీ మార్ట్‌లో రూ.200 పెట్టి కత్తి కొనుగోలు చేశానని చెప్పాడు. హత్య చేసే సమయంలో ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఉండేందుకు రెండు జతల గ్లౌజులు కూడా కొనుగోలు చేశానని చెప్పాడు. ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు బ్యాగ్‌లో పెట్టి.. సజ్జమీద పెట్టానని తెలిపాడు.
ఫిబ్రవరి 17వ తేదీన నవీన్ (naveen) కాల్ చేసి హైదరాబాద్ (hyderabad) వస్తున్నానని చెప్పాడు. తన స్నేహితుడు జీవన్ (jeevan) ఇద్దరం కలిసి ఉప్పల్‌లో సినిమాకి వెళ్లామని చెప్పాడు. నవీన్ ఎల్బీ నగర్లో ఉన్నానని కాల్ చేశాడు. బైక్‌పై వెళ్లి పికప్ చేసుకున్నామని.. నాగోల్‌లో భోజనం చేశాక… జీవన్ వెళ్ళిపోయాడు. మలక్ పేటలో తన ఇంటికి వెళ్ళామని తెలిపాడు. ఆ రోజు రాత్రి నవీన్ (naveen) హాస్టల్‌కు వెళతానంటే.. తాను కూడా వస్తానని చెప్పాను. సజ్జ మీద ఉన్న బ్యాగ్ తీసుకున్నానని తెలిపాడు. తన మొబైల్ నుంచి నవీన్ నిహారికకు కాల్ చేసి మాట్లాడాడని.. తరువాత రాత్రి 11 గంటలకు ఓఆర్ఆర్ దాటగా ఈ టైంలో అంత దూరం వద్దు అని చెప్పి మందు తాగాము. నిహారిక గురించి ఓ విషయం చెప్పాలి అన్నాను. నవీన్ (naveen) కూడా ఏంటో చెప్పమన్నాడు. కొంచెం లోపలికి వెళ్తే విషయం మొత్తం చెప్తానని చెప్పడంతో నవీన్ కూడా ఓకే అన్నాడు.
నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నిహారికను ప్రేమిస్తున్నానని చెప్పగా నవీన్ (naveen) కొట్టాడని తెలిపాడు. తాను నవీన్‌ను (naveen) బలంగా కొట్టి.. గొంతు నులిమి చంపేశానని వివరించాడు. ఊపిరి ఆడట్లేదని నిర్ధారించుకుని బ్యాగులో ఉన్న కత్తితో కోపంతో శరీర భాగాలు కోసేశానని తెలిపాడు. శరీర భాగాలు బ్యాగులో వేసుకొని బ్రాహ్మణపల్లి వైపు వెళ్లాను. అతని సెల్ ఫోన్‌ని రోడ్డు పక్కన పడేసాను. రాజీవ్ గృహకల్ప వెనకాల చెట్లపొదల్లో ఆ బ్యాగు పడేసి బ్రాహ్మణపల్లిలో తన ఫ్రెండ్ హాసన్ (hasan) ఇంటికి వెళ్ళాను. నవీన్ హత్య గురించి హసన్ (hasan) చెప్పగా.. భయపడి ఎందుకు అలా చేశావని తిట్టి వెంటనే పోలీసులకు లింగిపోవాలని చెప్పాడు. తెల్లవారి ఉదయం లేచి పోలీసులకు లొంగిపోతానని చెప్పి రక్తంతో ఉన్న బట్టలు, షూస్ బ్యాగును సాగర్ కాంప్లెక్స్ బస్ స్టాప్ వద్ద రోడ్డు పక్కన చెత్త కుప్పలో పడేశానని వివరించాడు.
ఉదయం 10 గంటలకు నిహారికకు ఫోన్ చేసి రోడ్డు మీదకి రమ్మన్నాను. నవీన్‌ని (naveen) చంపానని నిహారికతో చెప్పాను. ఆమె భయపడి ఎందుకలా చేశావని నన్ను తిట్టి మందలించింది. తర్వాత ఇంటికి వెళ్లి బండిని మా ఇంటి దగ్గర పెట్టి వరంగల్‌లో ఉన్న నాన్న దగ్గరికి వెళ్ళాను. నాన్నకు విషయం చెప్పడంతో పోలీసుల ముందు లొంగి పోవాలని చెప్పాడు. 24వ తేదీన హాసన్ ఇంటికి రాగా.. పోలీసులు అడుగుతున్నారు ఇంకా ఎందుకు లొంగిపోలేదని నిలదీశాడు. నవీన్ శరీర భాగాలు పడేసిన ప్రాంతానికి వెళ్లి ఆ సంచిని తీసుకొని… హత్య చేసిన స్పాట్‌కి వచ్చాను. అక్కడ శరీర భాగాలు కాల్చేశాను. తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల ముందు లొంగిపోయి హత్య విషయం చెప్పానని హరిహరకృష్ణ వెల్లడించాడు. ఇదీ నిజంగా క్రైమ్ హరర్ మూవీని తలపించే స్టోరీలా ఉంది. ప్రాణ స్నేహితుడినే ఓ అమ్మాయి కోసం హరిహర కృష్ణ చంపేశాడు.