ATP: తాడిపత్రికి చెందిన శ్రీగిరి రాజు వీవీఎస్ సాయికృష్ణ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో సత్తా చాటారు. జాతీయ స్థాయిలో 125వ ర్యాంకు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. తెలుగు రాష్ట్రాల వారీగా ఆయన 5వ ర్యాంకు దక్కించుకోవడం విశేషం. కఠిన శ్రమతో ఈ విజయం సాధించిన సాయికృష్ణను పలువురు అభినందించారు.