TPT: జిల్లా పర్యటన నిమిత్తం శనివారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్‌కు ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు జిల్లా జడ్జి గురునాథం, శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి తదితరులు ప్రధాన న్యాయమూర్తికి సాదరంగా స్వాగతం పలికారు.