ఈరోజు జరిగే కరీంనగర్ సభకు తాను హాజరు కాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. గత రెండు రోజులుగా ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
KTR : ఈరోజు జరిగే కరీంనగర్ సభకు తాను హాజరు కాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. గత రెండు రోజులుగా ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని డాక్టర్ తెలిపారు. గత కొద్ది రోజులుగా పలు సభలు, సమావేశాల్లో విస్తృతంగా పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. కామారెడ్డిలో జరిగిన సభ అనంతరం మూడు రోజుల క్రితం జ్వరంతో అస్వస్థతకు గురైన కేటీఆర్.. ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
ఈ నేపథ్యంలో నేడు కరీంనగర్లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయమవుతుందని వైద్యులు తెలిపారు.. కరీంనగర్ సభ విజయవంతానికి పార్టీ పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని, ముఖ్యంగా తన కార్యాలయం అన్ని పార్టీల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటోందని కేటీఆర్ తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులతో తన కార్యాలయం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు.