»Kcr Orders Brs Subsidiary Union Not Contest In Singareni Elections
Singareni ఎన్నికల్లో పోటీ చేయొద్దు, నేతలకు కేసీఆర్ ఆదేశం
సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయొద్దని తమ అనుంబంధ సంస్థకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. కేసీఆర్ తీరుపై కార్మిక నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారు పార్టీ వీడే అవకాశం ఉంది.
KCR Orders BRS subsidiary Union Not Contest In Singareni Elections
Singareni Elections: మరికొద్ది రోజుల్లో సింగరేణి సంస్థ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇటీవల హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 27వ తేదీన ఎన్నిక జరగనుంది. ఎన్నికల్లో పోటీ చేయొద్దని బీఆర్ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఆ కార్మిక సంఘం నేతలు షాక్ అవుతున్నారు.
యూనియన్‌కు చెందిన ముగ్గురు కీలక నేతలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. యూనియన్ ప్రెసిడెంట్ వెంకట్రావ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేంగెర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మాత్రమే ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయని సమయంలో యూనియన్‌లో ఎందుకు ఉండాలని అడుగుతున్నారు. ఇదే అంశంపై ఈ రోజు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఉద్యమం నుంచి ఆవిర్భవించిన యూనియన్ను ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పడం సరికాదని మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఇలా చెప్పడం బాధగా ఉందని అభిప్రాయ పడ్డారు. కేసీఆర్ (KCR) ఆదేశాలతో అసంతృప్తితో ఉన్న నేతలు.. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. అలా అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి (BRS) తొలి దెబ్బ తగలనుంది.