MBNR: గండీడ్ మండలం రెడ్డిపల్లి, చెన్నాయపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఎంపీడీవో గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఎండల దృష్ట్యా కూలీలకు తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదేశించారు. పనికి తగ్గ వేతనం అందేలా.. ఎంత మేర పని చేస్తే ఎంత డబ్బులు వస్తాయనే అంశంపై కూలీలకు స్పష్టమైన అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.