MNCL: ఢిల్లీలో ఈనెల 26 వరకు జరిగే అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ టోర్నమెంట్‌కు దండేపల్లి మండలం రిబ్బనపల్లి పాఠశాల పీడీ గాజుల శ్రీనివాస్ ఎంపికైనట్లు DYSO హనుమంత రెడ్డి ప్రకటనలో తెలిపారు. అతను రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి, జాతీయస్థాయికి ఎంపికైనట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా పీడీ శ్రీనివాస్‌ను DYSO, వాలీబాల్ సంఘం సభ్యులు అభినందించారు.