JGL: ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నాణ్యత లోపం లేకుండా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని వెంగలాయిపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సందర్శించి పరిశీలించారు. నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకున్నట్లయితే ప్రభుత్వ ఆర్థిక సహాయం అందుతుందన్నారు. వీరితో పాటు సర్పంచ్ గోపాల్, ఎంపీడీవో ఉన్నారు.