JN: విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించాలన్న లక్ష్యంతో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పాలకుర్తి MLA మామిడాల రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. తొర్రూర్ మండల కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం MLA ఈ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులతో కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.