JGL: కథలాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, జడ్పీ హైస్కూల్, అంబరిపేట, గంభీర్పూర్ జడ్పీ హైస్కూల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో 468 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంఈవో శ్రీనివాస్ తెలిపారు. ముందుగా సిబ్బంది విద్యార్థులను తనిఖీ చేసి గదుల్లోకి అనుమతించారు.