HNK: ప్రజాపాలన–ప్రగతి కార్యాచరణలో భాగంగా బుధవారం హన్మకొండ మర్కాజి జంక్షన్ వద్ద “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత కార్యక్రమం నిర్వహించారు. హన్మకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సతీష్ తదితరులు పాల్గొన్నారు.