NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతూ 30 ప్రదేశాలలో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో ఎల్లో అలర్ట్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు ఉదయం సాయంత్రం పూట పనులను చేసుకోవాలని మధ్యాహ్నం ఎండ నుంచి ఉపశమనం పొందాలని అధికారులు సూచిస్తున్నారు. మెండోరా, మోర్తాడ్, బాన్సువాడ తదితర ప్రాంతాలలో 35°C లకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.