BHPL: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపుతో ఏప్రిల్ 1ని బ్లాక్ డేగా పాటించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి డిపోలో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో బండి శ్రీనివాస్, సంతోష్, రంజిత్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.