KMM: ముదిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ జరగనుంది. ఈ మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముదిగొండ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జలాది నాగేంద్రప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. పిల్లలు, నేత్రం, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, దంత వైద్యం, ప్రసూతి, గైనకాలజీ వంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.