RR: శంషాబాద్ ఎయిర్పోర్టుకు గత కొంత కాలం నుంచి బెదిరింపులు అధికమవడంతో ప్రయాణికుల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి, బంగారం వంటి నిషేధిత వస్తువులను భారీగా పట్టుకుంటున్నారు. కస్టమ్స్, పోలీసుల అప్రమత్తతతో పలువురిని అదుపులోకి తీసుకుంటూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.