BDK: మణుగూరు రేగులగండి ప్రాంతంలో శనివారం గల్లంతైన నక్క హర్షవర్ధన్ కోసం శోధన కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆదివారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని బోట్లు, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టాయి. నీటి ప్రవాహంలో ముమ్మరంగా అన్వేషణ కొనసాగుతోంది. యువకుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.