ELR: ముసునూరు గ్రామంలో తాడి రాజు కు చెందిన ఇళ్ళు ఆదివారం పూర్తిగా దగ్ధం కావడంతో నూజివీడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొండేటి బాబి బాధితులను పరామర్శించారు. తక్షణసాయంగా సొంత నిధులు 5వేల రూపాయలు బాధిత కుటుంబానికి అందజేశారు. ప్రభుత్వ నుండి అందే సహాయం కోసం విన్నవించనున్నట్లు వివరించారు. బాధితులకు అండగా ఉంటామని బాబి భరోసా ఇచ్చారు.