KMM: ఖమ్మం ఆర్టీవో జగదీష్ విధులకు సంబంధించిన శిక్షణ నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. ఆయన 45 రోజుల పాటు శిక్షణ పొందనున్నారు. గ్రూప్-1 విభాగంలో ఆర్టీవోగా జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన ఆయన.. రవాణా శాఖ చేపట్టిన సంస్కరణలకు సంబంధించి శిక్షణ కోసం వెళ్లారని ఆ శాఖ సిబ్బంది తెలిపారు. ఆయన వచ్చేవరకు ఎంవీఐ శ్రీనివాస్ ఇంఛార్జ్ RTOగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.